రమదాన్.. 20 రోజులలో 20 మిలియన్ల మంది సందర్శన

- April 07, 2024 , by Maagulf
రమదాన్.. 20 రోజులలో 20 మిలియన్ల మంది సందర్శన

మదీనా:  రమదాన్ 1445 AH మొదటి 20 రోజులలో ప్రవక్త మసీదులో మొత్తం 19,899,991 మంది ఆరాధకులు సందర్శించినట్లు ప్రవక్త మసీదు వ్యవహారాల సంరక్షణ కోసం జనరల్ అథారిటీ వెల్లడించింది.అందులో1,643,288 మంది వ్యక్తులు ప్రవక్త ముహమ్మద్ (PBUH) సమాధిని సందర్శించారని, అల్-రౌదా అల్-షరీఫా 655,277 మంది సందర్శించినట్లు తెలిపింది. 185,544 మంది రవాణా సేవలను వినియోగించుకున్నారు.

ఈ సేవలతో పాటు 483,560 జమ్జామ్ వాటర్ బాటిళ్లను, 649,884 బహుమతుల పంపిణీని అధికార యంత్రాంగం సులభతరం చేసింది. ఉపవాసం విరమించే వారికి 5,901,198 భోజనాలు అందించినట్లు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com