'అభిమాన హీరో ద గ్రేట్' : బాలకృష్ణ

- June 06, 2016 , by Maagulf
'అభిమాన హీరో ద గ్రేట్' : బాలకృష్ణ

తన బర్త్‌డే వేడుకలకు అమెరికా వెళ్లిన నటుడు బాలకృష్ణ బిజీబిజీగా వున్నాడు. ఓ వైపు ఆయన కేన్సర్ ఆసుపత్రి కోసం ఫండ్ రైజింగ్ చేసే పనిలో నిమగ్నం కావడమేకాదు.. అభిమానులతో తీరికలేకుండా గడుపుతున్నాడు. తమ అభిమాన నటుడితో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.అందులోనూ 'గౌతమీపుత్ర శాతకర్ణి' స్టయిల్‌లో కనిపించడంతో ఆయన్ని తమ కెమెరాల్లో బంధించేందుకు చాలామంది ప్రయత్నించారు. ఇక సియోటిల్‌కు భారీ కాన్వాయ్‌తో ఈ హీరో బయలుదేరాడు. అడుగడుగునా బాలయ్యకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇలాంటి సీన్స్‌ మూవీలో తప్ప రియల్‌గా చూడలేదని, 'అభిమాన హీరో ద గ్రేట్' అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నందమూరి హార్డ్‌కోర్ ఫ్యాన్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com