'బొబ్బిలి రాజా' ఈజ్ బ్యాక్ ..
- June 06, 2016
వెంకటేశ్ హీరోగా నటించిన 'బొబ్బిలి రాజా' చిత్రంలో వెంకీ ఊతపదం 'అయ్యో అయ్యో అయ్యయ్యో..' గుర్తుందిగా. అంత త్వరగా మరిచిపోయేది కాదులెండి. వెంకీలోని అదే చిలిపిదనాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు మారుతి. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న చిత్రం 'బాబు బంగారం'. సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సూరద్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పకుడు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. ఇందులో వెంకీ పలికిన సరదా సంభాషణలు ఆకట్టుకునే ఉన్నాయి. చివర్లో వచ్చిన 'అయ్యో అయ్యో అయ్యయ్యో' డైలాగ్ అయితే 'బొబ్బిలి రాజా' ఈజ్ బ్యాక్ అన్నట్టుగా ఉంది.ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి జిబ్రాన్ సంగీత దర్శకుడు. త్వరలో ఈ సినిమా ఆడియో విడుదల కానుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







