సూర్య గ్రహణం,2024

- April 08, 2024 , by Maagulf
సూర్య గ్రహణం,2024

ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడుతుంది. గ్రహం యొక్క స్థానం మారుతున్న కొద్దీ, వ్యక్తి యొక్క అదృష్టం కూడా మారుతుంది. మన జీవితంలో గ్రహాలు, నక్షత్రాలకు ప్రత్యేక పాత్ర ఉంది. వాటిలో సూర్యగ్రహణం , చంద్రగ్రహణం కూడా ముఖ్యమైనవి. ఈ సంవత్సరం రెండు సూర్య గ్రహణాలు , రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. తొలి చంద్రగ్రహణం ఇప్పటికే ఏర్పడింది  రేపు అంటే  ఏప్రిల్ 8,2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం రాబోతుంది.

భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8 రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:25 గంటలకు ముగుస్తుంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమవుతుంది.సంపూర్ణ సూర్యగ్రహణం మొత్తం వ్యవధి 4 గంటల 25 నిమిషాల పాటు కొనసాగుతుంది, అందులో మొత్తం భూమి దాదాపు 8 నిమిషాల పాటు చీకటితో కప్పబడి ఉంటుంది. భారతదేశంలో గ్రహణం  కనిపించనప్పటికీ ఈ సూర్యగ్రహణం చాలా దేశాల్లో చూడవచ్చు.

సూర్య దేవుడు ప్రజల విధిని ప్రభావితం చేస్తాడు. కాబట్టి, ఈ ప్రత్యేకమైన రోజున మీరు తినడానికి , తిరగడానికి  కొన్ని నియమాలను ఉన్నాయి.కాబట్టి ప్రజలు గ్రహణం రోజు ఏదైనా తినడానికి ముందు జాగ్రత్తగా ఉండాలి ,  గ్రహణ సమయంలో తినకుండా ఉండాలి. సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూడటం నిషేధించబడింది. ఈ నియమం తప్పక పాటించాలి. సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి కంచు పాత్రలలోని నీటి నుండి పనికిరాని ఎక్స్-రే ప్లేట్ల వరకు ప్రతిదీ ఉపయోగించబడింది. అయితే ఇప్పుడు గ్రహణాన్ని ప్రత్యేక సన్ గ్లాసెస్ తో చూడొచ్చు. 

                              --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com