పడవ మునిగి 90 మందికి పైగా మృతి

- April 08, 2024 , by Maagulf
పడవ మునిగి 90 మందికి పైగా మృతి

మొజాంబిక్‌: చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి ప్రమాదవశాత్తు పడవ మునగడంతో దాదాపు 90 మందికి పైగా దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌లో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో 130 మంది ఉన్నారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణించడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారాలు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్న పిల్లలు ఉన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. పడవ మునిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కలరా వ్యాప్తి అంటూ వదంతులు రావడం వల్ల ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకొని దీవుల్లోకి వెళుతుండగా ఈ పడవ మునిగిందని నాంపుల ప్రావిన్స్‌ సెక్రటరీ జైమ్‌ నెటో తెలిపారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటైన మొజాంబిక్‌లో గత అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు 15,000 కలరా కేసులు నమోదవ్వగా, 32 మంది చనిపోయినట్లు ప్రభుత్వ నివేదికలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com