పడవ మునిగి 90 మందికి పైగా మృతి
- April 08, 2024
మొజాంబిక్: చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి ప్రమాదవశాత్తు పడవ మునగడంతో దాదాపు 90 మందికి పైగా దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌లో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో 130 మంది ఉన్నారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణించడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారాలు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్న పిల్లలు ఉన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. పడవ మునిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కలరా వ్యాప్తి అంటూ వదంతులు రావడం వల్ల ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకొని దీవుల్లోకి వెళుతుండగా ఈ పడవ మునిగిందని నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నెటో తెలిపారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటైన మొజాంబిక్‌లో గత అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 15,000 కలరా కేసులు నమోదవ్వగా, 32 మంది చనిపోయినట్లు ప్రభుత్వ నివేదికలు తెలిపాయి.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







