‘పుష్ప 2’ టీజర్.! బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.!
- April 08, 2024
బన్నీ మాస్ జాతర మొదలైంది. ‘పుష్ప 2’ టీజర్ అనుకున్నట్లుగా ఆయన బర్త్‌డే స్పెషల్‌గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రోజుకో పోస్టర్ రిలీజ్ చేసి ఈ గ్లింప్స్‌పై ఆసక్తి క్రియేట్ చేసినట్లుగానే ఫ్యాన్స్‌కి మంచి బర్త్‌డే ట్రీట్ ఇచ్చాడు బన్నీ.
జాతరలో మహిషాషుర మర్దని గెటప్‌లో దుండగుల్నీ చీల్చి చెండాడే సందర్భంలో చిత్రీకరించిన సన్నివేశమిది. బన్నీ గెటప్ ట్రెమండస్‌గా వుంది. కత్తితో బొట్టు పెట్టుకోవడం దగ్గర్నుంచి కాలికి కట్టిన గజ్జెలు ఘల్లుమనే శబ్ధం వరకూ గూస్ బంప్స్ తెప్పించేలా వున్నాయ్.
దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఇవ్వబోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ధియేటర్లలో ఎలా దద్దరిల్లబోతోందో శాంపిల్‌గా చూపించారు ఈ టీజర్‌లో.
ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటే రేంజ్‌లో వున్నాయ్. అసలే బన్నీ ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







