బాలయ్య-బాబీ ‘వీర మాస్’కి సై అంటే సై.!?
- April 08, 2024
‘వాల్తేర్ వీరయ్య’ సినిమా తర్వాత దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం బాలయ్య 109 వ చిత్రం. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్లుగా మాస్ ఊర మాస్ అనేలా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు బాబీ.
‘వాల్తేర్ వీరయ్య’ వంటి సూపర్ హిట్ కొట్టిన బాబీ, ఆ హిట్టుని కంటిన్యూ చేసేలా ఈ సినిమా వుండాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు అన్నీ.
‘భగవంత్ కేసరి’ సినిమా తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం ఇదే. ఆ సినిమా యావరేజ్ అనిపించుకున్నా.. బాలయ్య ఇమేజ్ మాత్రం అలాగే వుంది.
ఇప్పుడు బాబీతో చేస్తున్న సినిమా కోసం కూడా బాలయ్య చాలా కష్టపడుతున్నాడట. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం బాబీ తన హిట్టు సెంటిమెంట్ కంటిన్యూ అయ్యేలా ఈ సినిమాకి టైటిల్ ప్లాన్ చేశాడనీ తెలుస్తోంది.
‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలోంచి ‘వీర’ తీసుకుని.. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్లుగా మాస్ చేర్చి.. ‘వీర మాస్’ అని వచ్చేలా టైటిల్ ఫిక్స్ చేశాడనీ ప్రచారం జరుగుతోంది.
దీనిపై అధికారిక ప్రకటన రావాలంటే ఉగాది వరకూ ఆగాల్సిందే. ఆ రోజు ఈ సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్లు ఇవ్వబోతున్నారట బాబీ అండ్ టీమ్.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'