బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడమెలా?
- April 08, 2024
కొంతవరకూ శరీరానికి కొలెస్టాల్ అవసరం వుంటుంది. అందుకే శరీరంలోని కొలెస్ర్టాల్‌ని మంచి కొలెస్ర్టాల్, చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాలుగా విడదీసి చెబుతారు వైద్య పరిభాషలో. అయితే, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంతుండాలి.? అసలు దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి.? అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చెడు కొలెస్ట్రాల్‌ని ముందుగా గుర్తించకపోతే గుండె పోటు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ చెడు కొలెస్ర్టాల్ కారణంగా గండెకు రక్తాన్ని సరఫరా చేసే సిరల్లో బ్లాక్స్ ఏర్పడతాయ్. తద్వారా గుండెకు రక్తం పంపిణీ సక్రమంగా జరగదు. దాంతో గుండె పోటు వచ్చే ప్రమాదం వుంది.
అందుకే 40 ఏళ్లు దాటాకా అప్పుడప్పుడూ వైద్యుని వద్దకు వెళ్లి కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. బ్యాడ్ కొలెస్ర్టాల్ ఎప్పుడైనా సరే, 100 mg బై dl కంటే తక్కువగా వుండాలి. అంతకన్నా ఎక్కువ వుంటే ముప్పు తప్పదు.
ఈ కొలెస్ర్టాల్‌ని తగ్గించుకోవడానికి ఖచ్చితంగా జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
జంక్ ఫుడ్‌కి పూర్తిగా దూరంగా వుండాలి. ధూమపానం, మధ్యపానం అలవాట్లుంటే వాటిని మానేయాలి. ప్రతీరోజూ తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా శారీరక శ్రమ కల్గించాలి. టైమ్‌కి సరైన పోషకాహారం తీసుకోవడంతో పాటూ, నిద్ర సరిగ్గా వుండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. బ్యాడ్ కొలెస్ర్టాల్ సమస్య నుంచి కొంత బయటపడే అవకాశముంది. వీటితో పాటూ వైద్య చికిత్స కూడా అవసరమే సుమా.!
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..