తమిళ తెరపై సంఘవి..
- June 06, 2016
దశాబ్దం క్రితం వరకూ హీరోయిన్‌గా మురిపించిన సంఘవి మళ్లీ తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన ఆమె దక్షిణాది భాషలన్ని కలిపి దాదాపు 80 చిత్రాల్లో నటించారు. 2005 వరకు హీరోయిన్ పాత్రల్లో రాణించినా... ఆ తరువాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో పరిశ్రమకు దూరమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరుకి చెందిన పారిశ్రామికవేత్త వెంకటేష్‌ని పెళ్లి చేసుకొని వివాహబంధంలో అడుగుపెట్టారు. అయితే భర్త అనుమతించడంతో పెళ్లి తరువాత కూడా నటించేందుకు సిద్ధమని సంఘవి వెల్లడించడంతో తమిళంలో ఆమెకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. హీరోయిన్‌గా కాకపోయినా, కథలో ప్రాముఖ్యత ఉన్న పాత్రల్ని ఎంచుకుంటున్నారు సంఘవి.ఈ కోవలోనే 'మూడార్ కూడమ్', 'కొళంజి' చిత్రాల్లో నటిస్తున్నారు. తన రెండో ఇన్సింగ్స్‌కు ఈ రెండు చిత్రాలు ఎంతో కీలకమైనవని ఓ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. నటనకు ప్రాధాన్యమున్న ఏ పాత్రల్లో అయినా నటించేందుకు తాను సిద్ధమని సంఘవి తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







