ఏప్రిల్ 10న ఈద్ అల్ ఫితర్

- April 09, 2024 , by Maagulf
ఏప్రిల్ 10న ఈద్ అల్ ఫితర్

యూఏఈ: రమదాన్ ముగింపును సూచించే షవ్వాల్ నెలవంక యూఏఈలో కనిపించలేదు. దీంతో పవిత్ర మాసం మొత్తం 30 రోజుల పాటు కొనసాగుతుంది.  మంగళవారం రమదాన్ చివరి రోజు. ఇస్లామిక్ పండుగ ఈద్ అల్ ఫితర్ ఏప్రిల్ 10 (బుధవారం) నాడు వస్తుంది. అంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు వారాంతాలతో సహా తొమ్మిది రోజుల సెలవులు లభించనున్నాయి.   

ఉచిత పార్కింగ్

దుబాయ్: దుబాయ్‌లో ఉచిత పార్కింగ్ ఏప్రిల్ 7 ఆదివారం ప్రారంభమైంది. ఏప్రిల్ 12 వరకు ఉచిత ఆఫర్ కొనసాగుతుంది. 

అబుదాబి: ఏప్రిల్ 8  నుండి ఏప్రిల్ 14 ఆదివారం వరకు పార్కింగ్ ఉచితం. ఏప్రిల్ 15 నుంచి తిరిగి ఛార్జీలు వర్తిస్తాయి

షార్జా: నీలం రంగు సైన్‌బోర్డ్‌లు ఉన్న జోన్‌లు మినహా మిగిలిన అన్ని జోన్లలో ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 12 వరకు పార్కింగ్ ఉచితం. అంటే మూడు రోజుల ఉచిత పార్కింగ్. ఏప్రిల్ 13, శనివారం నుండి ఛార్జీలు వర్తిస్తాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com