కువైట్ జాతీయ అసెంబ్లీ వాయిదా..ఎంపీలు ఏమన్నారంటే?

- April 10, 2024 , by Maagulf
కువైట్ జాతీయ అసెంబ్లీ వాయిదా..ఎంపీలు ఏమన్నారంటే?

కువైట్: ఏప్రిల్ 17న జరగాల్సి న కువైట్ కొత్త జాతీయ అసెంబ్లీ ప్రారంభ సెషన్‌ ను మే 14కు వాయిదా వేస్తూ అమిరి డిక్రీ జారీ చేయచేసారు. తాత్కాలిక ప్రధాన మంత్రి హెచ్‌హెచ్ షేక్ డాక్టర్ మొహమ్మద్ సబా అల్-సలేమ్ అల్-సబా కొత్త క్యాబినెట్‌ను ఏర్పాటు చేయడానికి నిరాకరించిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాన్ని వాయిదా వేశారు. సాధారణంగా ఎన్నికల ఫలితాలను ప్రకటించిన రెండు వారాల్లోగా కొత్త అసెంబ్లీ ప్రారంభ సమావేశాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని రాజ్యాంగం చెబుతుంది. ఏప్రిల్ 4న జరిగిన ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 5న వెలువడ్డాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 106 ఆధారంగా..ఒక నెలపాటు అసెంబ్లీ సమావేశాలను సస్పెండ్ చేసే హక్కును అమీర్‌కు ఉంది. కొత్త ప్రధానికి తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి మరింత సమయం ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమీర్ కార్యాలయం వెల్లడించింది. మరోవైపు మాజీ స్పీకర్ మార్జౌక్ అల్-ఘానెమ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలను ఒక నెల పాటు సస్పెండ్ చేయడానికి పాలకుడికి అనుమతించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 106 అసెంబ్లీ పదవీకాలం ప్రారంభమయ్యే ముందు వర్తించదని అన్నారు. అసెంబ్లీ గడువు మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. ఈ సందర్భంలో వర్తించేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 87 అని, కొత్త అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రెండు వారాల్లోపు దాని ప్రారంభ సమావేశాన్ని నిర్వహించాలని స్పష్టంగా చెబుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 17న జరిగే ప్రారంభ సమావేశానికి హాజరవుతామని పెద్ద సంఖ్యలో ఎంపీలు తమ ‘ఎక్స్’ అకౌంట్లలో తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com