విజయ్ సరసన ఛాన్స్ కొట్టేసిన రవితేజ హీరోయిన్.?
- April 10, 2024
‘భానుశ్రీ బోర్సె’.. ఈ మధ్య ఈ పేరు టాలీవుడ్‌లో తెగ వినిపించింది. ఎవరీ భానుశ్రీ.? అంటే ఇంతవరకూ ప్రేక్షకులకు పరిచయం కాలేదు. త్వరలోనే మాస్ రాజా రవితేజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.
మాస్ రాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రాబోయే ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో హీరోయినే ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం షూటింగ్ దశలో వుందీ సినిమా. ఇంకా ఈ సినిమా రిలీజ్ కాకుండానే, అమ్మడి పేరు మార్మోగిపోతోంది.
అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ ముద్దుగుమ్మ మరో బంపర్ ఛాన్స్ కొట్టేసిందనీ తెలుస్తోంది. అదేంటంటే, రౌడీ స్టార్ కాదు కాదు, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ సినిమాలో భానుశ్రీ బోర్సె హీరోయిన్‌గా ఎంపికైందని ప్రచారం జరుగుతోంది.
విజయ్ దేవరకొండ, గౌతమ్ తీన్ననూరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం విజయ్ పోలీసాఫీసర్ గెటప్ వేయబోతున్నాడు. ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా శ్రీలీలను అనుకున్నారు. కానీ, ఆ ప్లేస్‌లో ఇప్పుడు భానుశ్రీ బోర్సె పేరు వినిపిస్తోంది. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.!
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!