సందీప్ రెడ్డి ‘యానిమల్’ థియరీ.!
- April 10, 2024
‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా, ప్రబాస్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకి సంబంధించి ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం.. అన్న చందంగా అంచనాలు ఆకాశాన్నంటేలా చేస్తున్నారు.
‘యానిమల్’ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. మొదట్లో టాక్ అంతంత మాత్రంగా వచ్చినప్పటికీ, ‘యానిమల్’ కలెక్షన్లు బాగా రాబట్టింది.
దాంతో, ‘స్పిరిట్’పై అంచనాలు సహజంగానే వున్నాయ్. అంతేకాదు, ఈ సినిమాని ఇంకా స్టార్ట్ చేయకుండానే మా సినిమా అలా వుండబోతోంది.. ప్రబాస్‌ని ఇలా చూపించబోతున్నా.. అంటూ అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా.
దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకి శాటిలైట్ రైట్స్ ద్వారా దాదాపు 150 కోట్ల వరకూ వసూళ్లు వచ్చేస్తాయట. ఇక, మిగిలినది సందీప్ రెడ్డి మార్కెటింగ్ స్కిల్స్‌తో ఈజీగా రాబట్టేస్తాడని ట్రేడ్ వర్గాల అంచనా.
అంతేకాదు, హీరోల్ని వాడడంలో సందీప్ రెడ్డి వంగా స్పెషల్ డాక్టరేట్ తీసుకున్నాడు. అలాంటిది ప్రబాస్‌లాంటి కటౌట్‌ని ఏ రేంజ్‌లో వాడబోతున్నాడో.. అని రకరకాల ప్రచారాలు సైతం ఇంట్రెస్టింగ్‌గా వినిపిస్తున్నాయ్.
సినిమాని ముందు నుంచే ప్రమోట్ చేయడానికి చాలా చాలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడట సందీప్ రెడ్డి వంగా. ‘యానిమల్’ థియరీనే ఈ సినిమాకీ అప్లై చేయబోతున్నాడట. చూడాలి మరి, ఎన్ని సంచలనాలకు వేదికవుతందో ‘స్పిరిట్’.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







