ప్రబాస్‌తో ఆ దర్శకుడు తీయబోయే సినిమా ఏంటో తెలుసా.?
- April 10, 2024
‘సలార్’ తర్వాత ప్రబాస్ సమాంతరంగా చాలా సినిమాలు పూర్తి చేస్తున్నాడు. అందులో ఒకటి హను రాఘవపూడి సినిమా కూడా వుంది. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదికి వెళ్లలేదు కానీ, కన్‌ఫామ్ అయిన ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటి.
ఈ సినిమా గురించి తాజాగా హను రాఘవపూడి కొన్ని విషయాలు వెల్లడించాడు తాజాగా ఓ ఈవెంట్ సందర్భంగా. అవేంటయ్యా అంటే, ఈ మూవీని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించాలనుకుంటున్నాడట హను.
‘ఫౌజీ’ అనే టైటిల్ కూడా ప్రచారంలో వుంది. ఈ సినిమాలోనూ తన గత సినిమా (సీతారామం) హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌నే ఫిక్స్ చేశాడట హను రాఘవపూడి. ‘ఫౌజీ’ అనే టైటిల్‌ని బట్టి.. ఈ సినిమాలో ప్రబాస్‌ని ఓ సైనికుడిగా చూపించబోతున్నాడనీ తెలుస్తోంది.
అందమైన లొకేషన్లలో అద్బుతమైన దృశ్య కావ్యంలా ఈ సినిమాని రూపొందించబోతున్నాడట. ఈ వివరాలన్నీ స్వయంగా హను రాఘవపూడినే వెల్లడించడం విశేషం. అయితే, అసలు కథ, కమామిషు ఎలా వుండబోతోందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.!
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







