విషు పండుగ

- April 14, 2024 , by Maagulf
విషు పండుగ

విషు అనేది హిందూ పండుగ. సంస్కృత భాషలో 'విషు' అంటే 'సమానం' మరియు ఇది మలయాళీల పండుగ మాత్రమే కాదు. మలయాళీ ప్రజలు విషు పండుగను నూతన సంవత్సర వేడుకగా జరుపుకుంటారు. ఈ పండుగను భారతదేశం అంతటా వివిధ పేర్లతో జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది, మహారాష్ట్రలో గుడి పడ్వా , అస్సాంలో బిహుగా జరుపుకుంటారు. మలయాళ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 14న ఈ సంవత్సరం విషు పండుగను జరుపుకుంటారు.

పురాణాల ప్రకారం చెడుపై మంచి విజయం సాధించిన సూచనగా ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ ముందురోజు రాత్రి ఇంట్లోని మహిళల్లో పెద్దవయస్కురాలు పచ్చి బియ్యం, కొత్తబట్టలు, బంగారు పసుపు వన్నెలో ఉండే దోసకాయలు, అరటిపళ్లు, తమలపాకులు, అద్దం వీటన్నిటినీ ఉరళి అనే ప్రత్యేక పాత్రలో పెట్టి పూజగదిలో దేవుడి దగ్గర ఉంచుతారు. వాటన్నింటిని ఉంచిన పాత్రను"విశుక్కని" అంటారు. మర్నాడు ఆమె ముందుగా లేచి వయసుల వారీగా ఇంట్లో అందరిని నిద్రలేపి, వారి కళ్లు మూసి ఆ పాత్ర దగ్గరకు తీసుకొచ్చి అప్పుడు కళ్లు తెరవమంటుంది. ఎందుకంటే ఉదయాన్నే లేవగానే మంగళకరమైన "విశుక్కని" ని చూస్తే అంతా శుభమే జరుగుతుందని  మలయాళీల నమ్మకం.

                                                          --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com