ఇరాన్-ఇజ్రాయెల్ సంక్షోభం వేళ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!
- April 15, 2024
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సంక్షోభం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లోని భారతీయుల రక్షణ తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మూడోసారి అధికారంలోకి వస్తే..ఉద్రిక్తతలు చెలరేగుతున్న ప్రాంతాలలో ఉన్న భారతీయ పౌరుల జీవితాలకు భద్రతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. కాగా, సిరియాలోని ఎంబసీ కార్యాలయంపై వైమానిక దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ 300కి పైగా క్షిపణులు ప్రయోగించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య తరచూ అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయి. అనేక ప్రాంతాలలో యుద్ధం లాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తంగా ఉంది. ప్రపంచ దేశాల్లో శాంతి లేదు. ఇటువంటి సమయంలో దేశ పౌరుల భద్రతకు భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం. విదేశాలలో ఉంటున్న మన ప్రజల భద్రతే మా ప్రభుత్వం లక్ష్యం. యుద్ధ భయం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ సమయంలో పూర్తి మెజారిటీతో బలమైన, స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది ప్రజల ముందు ఉన్న తక్షణ కర్తవ్యం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశాన్ని ఆర్థికంగా మరింత దృఢంగా మార్చే ప్రభుత్వం అవసరం. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ.. ‘విక్షిత్ భారత్’ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది” అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
ఇక ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో అక్కడ ఉంటున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. గతేడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు జరిగిన సమయంలో కూడా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్‌లోని మన వారిని స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ చేపట్టింది. తద్వారా 1,309 మంది భారత పౌరులు, 14 మంది ఓసీఐ కార్డుదారులు, 20 మంది నేపాలీలను తరలించడం జరిగింది. అలాగే రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ సమయంలో మోదీ ప్రభుత్వం ఆపరేషన్ గంగా ద్వారా 25వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







