వరల్డ్ ఆర్ట్ డే

- April 15, 2024 , by Maagulf
వరల్డ్ ఆర్ట్ డే

కల.. నిద్దర్లో వచ్చేది. కళ.. నిద్దర లేపేది అనే మాటలను ఈరోజున గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు ప్రపంచ కళా దినోత్సవం (World Art Day) కాబట్టి , నిజానికి కళ లేకపోతే జీవితంలో ఏదో వెలితిగా ఉంటుంది. మూగబోయిన గొంతు నుండి వచ్చే మాట పాటగా మారాలంటే కళ కావాలి. జీవితం కొత్తగా అనిపించే కొంత కళాపోషణ ఖచ్చితంగా ఉండాల్సిందే. కళ గురించి ఇంకా చెప్పుకునే ముందు అందరికీ ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.

2012లో యునెస్కో భాగస్వామి అయిన అంతర్జాతీయ కళా సమితి వారు ప్రతి యేటా ఏప్రిల్ 15వ తేదీన ప్రపంచ కళా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. ఈరోజే ఎందుకంటే, ఆ రోజు ప్రపంచం ప్రఖ్యాతి గాంచిన కళాకారుడైన లియోనార్డో డావిన్సీ జన్మదినం కాబట్టి. ఆయన కుంచె నుండి జాలువారిన మోనాలీసా పెయింటింగ్ వేసి ప్రపంచ కళాకారుల్లో చెరగని పేరుని లిఖించుకున్న విషయం మనకు తెలిసిందే. డావిన్సీ గౌరవార్థం ఈ తేదీని "వరల్డ్ ఆర్ట్ డే" గా ఎంచుకున్నారు.

--సోమ శేఖర్(ఆర్టిస్ట్ హైదరాబాద్)

కళను అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో పాఠశాలల్లో, కాలేజీల్లో కళకి సంబంధించిన సంబరాలు జరుపుతారు. ఫ్రాన్స్, ఇటలీ,   స్లోవేకియా, స్వీడన్,బ్రిటన్ మొదలగు దేశాల్లో ఈ రోజున ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ సోమ శేఖర్ యొక్క చిత్రాలు.

 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

--సోమ శేఖర్(ఆర్టిస్ట్ హైదరాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com