జూన్ రెండో వారంలో మరో లాంగ్ వీకెండ్..!
- April 15, 2024
యూఏఈ: రమదాన్ సెలవులు ముగిసాయి. ఈద్ అల్ ఫితర్‌కు గుర్తుగా 9 రోజుల లాంగ్ వీకెండ్ ను నివాసితులు, ప్రజలు పొందారు. రాబోయే రోజుల్లో ఇస్లాంలోని అత్యంత పవిత్రమైన రోజు అరాఫా డే, ఈద్ అల్ అదా పండుగను ఆనందించనున్నారు. జూన్ రెండో వారంలో లాంగ్ వీకెండ్ ఉంటుంది. అల్ మనార్ ఇస్లామిక్ సెంటర్‌లోని NGS మరియు ఖతీబ్ ఇమామ్ షేక్ అయాజ్ హౌజీ ప్రకారం.. అన్ని ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్ నెలలు రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించే సమయాన్ని బట్టి 29 లేదా 30 రోజులు ఉంటాయి. ఇస్లామిక్ క్యాలెండర్‌లో దుల్ హిజ్జా 9న అరఫా దినం ఉంది. ఈద్ అల్ అదా తర్వాత మూడు రోజుల పాటు జరుపుకుంటారు.
ఈద్ బ్రేక్ తేదీలు(అంచనా)
దుబాయ్ ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్‌మెంట్ (IACAD) వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన హిజ్రీ క్యాలెండర్ ప్రకారం.. జూన్ 8(శనివారం) నాడు ధుల్ హిజ్జా 1 వచ్చే అవకాశం ఉంది. ఖగోళ శాస్త్ర లెక్కలు అదే తేదీని అంచనా వేస్తున్నాయని, దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ ఆపరేషన్స్ మేనేజర్ ఖదీజా అహ్మద్ తెలిపారు. ఇదిలావుంటే, జూన్ 16 (దుల్ హిజ్జా 9) ఆదివారం అరఫా దినం. ఈద్ అల్ అధా సోమవారం, జూన్ 17 (దుల్ హిజ్జా 10), జూన్ 16( ఆదివారం) నుండి జూన్ 19(బుధవారం) వరకు ఉంటుంది. వారాంతం (జూన్ 15)తో సహా పండుగకు గుర్తుగా ఐదు రోజులు సెలవు అవుతుంది. చంద్రుని వీక్షణలను బట్టి అవసరమైతే ఈ తేదీలు మారతాయి.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







