భారతీయ రైలు రవాణా దినోత్సవం

- April 16, 2024 , by Maagulf
భారతీయ రైలు రవాణా దినోత్సవం

ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఇండియన్ రైల్వేస్(Indian Railways) ముందు వరుసలో ఉంటుంది. సరుకు రవాణాతో పాటు ప్రజలను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడంలో భారత రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది. నేడు భారతీయ రైలు రవాణా దినోత్సవం.

మన దేశంలో సుమారు 170 ఏళ్ల క్రితమే మొదటి రైలు అందుబాటులోకి వచ్చింది. 1853, ఏప్రిల్ 16న భారతీయ రైల్వే బోరి బందర్ (ప్రస్తుతం ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ ) నుంచి థానే మధ్య మొదటి ప్యాసింజర్ రైలును ప్రవేశపెట్టింది. 34 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ కవర్ చేసేది. అయితే దీని జ్ఞాపకార్థంగా ఏటా ఏప్రిల్ 16న భారతీయ రైలు రవాణా దినోత్సవం (Indian Rail Transport Day) జరుపుకుంటున్నారు.

భారతదేశంలో రైల్వేలకు పునాది వేయడంలో జమ్‌సెట్జీ జీజీభోయ్, జగన్నాథ్ సుంకర్‌సేత్‌ కీలక పాత్ర పోషించారు. 160 ఏళ్ల క్రితం వీరిద్దరే తొలి రైల్వే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడంలో, మద్దతు ఇవ్వడంలో అందరికంటే వారే ముందున్నారు.1853 నుంచి భారతీయ రైల్వేలు సామాన్యుల జీవితంలో అంతర్భాగమైందని, దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధికి రైల్వేలు దోహదపడుతున్నాయి.  

                                  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com