ఇరాన్ గూఢచారులు సౌదీలో అరెస్ట్
- June 06, 2016
సౌదీ అరేబియా 33 మంది గూడచారుల్ని అరెస్ట్ చేసింది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్‌తో సంబంధాలున్న కారణంగా, ఆ దేశాల తరఫున గూఢచర్యం నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇందులో 30 మంది సౌదీలు కాగా, ఓ ఇరానియన్, అలాగే ఓ ఆఫ్గాన్, ఓ జోర్డానియన్ ఉన్నారు. వీరిలో ఓ వ్యక్తి ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్నాడు. 32 మంది ఇరాన్‌తో సంబంధాలున్నాయి. వీరందరికీ ఇరానియన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌తో సంబంధాలున్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించిన ఆధారాలన్నిటినీ పోలీసులు సేకరించారు. ఇరాన్ కోసం గూఢచర్యం నిర్వహించేందుకు రిక్రూట్‌మెంట్లు కూడా చేపట్టినట్లు నిందితులపై ఆరోపణలున్నాయి. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని వీరిపై కేసులు నమోదు చేశారు. ఇరాన్, లెబనాన్‌లో శిక్షణ తీసుకుని, సౌదీ అరేబియాలో అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు వీరిపై అభియోగాలు మోపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







