పేదలకు సాయంపై క్యాంపెయిన్
- June 06, 2016
పవిత్ర రమదాన్ సందర్భంగా పేదవారిని ఆదుకునేందుకోసం చైతన్యం పెంచే కార్యక్రమాలను చేపడుతున్నారు. 'ది ట్రీ ఆఫ్ గాడ్ డీడ్స్' ప్రోగ్రామ్ ద్వారా సేవా కార్యక్రమాలపై అవగాహన పెంచనున్నారు. షేక్ రషీద్ బిన్ హమదాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్, నహతామ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, గ్రేస్ కన్వర్జేషన్స్, ఖాలిదియా మాల్ వంటి సంస్థలు ఇందులో భాగం పంచుకుంటున్నాయి. ట్రీ ఆఫ్ లైఫ్ అనే కాన్సెప్ట్‌లో భాగంగా, ఒక్కొక్కరూ ఒక్కో ఆకుని 10 దిర్హామ్‌లకు కొనుగోలు చేసి, చెట్టుకి అతికించడం ద్వారా జీవం లేని చెట్టుకి జీవం పోసినట్లవుతుందనే గొప్ప విషయాన్ని నిరూపించనున్నారు. పేదలకు సహాయం చేసేందుకు ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్‌తో ఎవరైనా ముందుకు వస్తే, వారికి విశేష ప్రాచుర్యం కల్పిస్తామని, సమాజానికి వారు సేవ చేసినట్లవుతుందని నిర్వాహకులు తెలిపారు. పవిత్ర రమదాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







