తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..
- April 16, 2024
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. జూలై కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈనెల 18న టీటీడీ విడుదల చేయనుంది. 18వ తేదీ ఉదయం 10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు సుప్రభాతం, తోమాల, అర్చన అష్టదళపాదపద్మారాధన టికెట్లు పొందడానికి ఆన్ లైన్ లో పేర్ల నమోదుకు అవకాశం ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం 12గంటలకు లక్కీడీప్ లో టికెట్లు కేటాయిస్తారు. వీటిని పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.
కల్యోణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. అదేరోజు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జులై నెల కోటాను మధ్యాహ్నం 3గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
ఏప్రిల్ 23న ఉదయం 10గంటలకు జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
ఏప్రిల్ 23న శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వయో వృద్ధులు, దివ్యాంగుల, దీర్ఘకాలిక వ్యాదులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
జూలై నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.తిరుమల, తిరుపతిలలో జూలై నెల గదుల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
ఏప్రిల్ 27న శ్రీవారి సేవ ఉదయం 11గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1గంటకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







