దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- April 17, 2024దుబాయ్: భారీ వర్షపాతం కారణంగా దుబాయ్ మెట్రో సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సేవలు దాదాపుగా నిలిచిపోయాయి.దాదాపు 200 మంది ప్రయాణికులు అనేక స్టేషన్లలో చిక్కుకుపోయారు. రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) దుబాయ్‌లోని మెట్రో మరియు రోడ్డు వినియోగదారులందరికీ సాఫీగా నావిగేషన్ ఉండేలా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దుబాయ్ మెట్రో ఏప్రిల్ 17న రెడ్ మరియు గ్రీన్ లైన్ల వెంట స్టేషన్లలో షెడ్యూల్ మెయింటెనెన్స్‌ను ప్రకటించింది. RTA వారి గమ్యస్థానాలకు చేరుకోవడంలో ప్రయాణికులకు సహాయం చేయడానికి గ్రీన్ మరియు రెడ్ లైన్ల వెంట నిర్దిష్ట స్టేషన్లలో ఉచిత షటిల్ బస్సు సేవలను అందిస్తుందిన్నట్లు తెలిపింది. మరోవైపు సెంటర్‌పాయింట్ వైపు దుబాయ్ మెట్రో కార్యకలాపాలు నిలిపివేయడంతో దాదాపు 200 మంది ప్రయాణికులు గంటల తరబడి సౌకర్యాలు లేకుండా జెబెల్ అలీ మెట్రో స్టేషన్‌లో చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- BNI ఇండియా డెలిగేషన్‌తో బిజినెస్ కాంక్లేవ్.. 46 మంది హాజరు..!!
- కార్బన్ ఉద్గారాల తగ్గింపునకు కార్యాచరణ..ఈవీలకు ప్రోత్సాహం..!!
- యూఏఈలో అమెరికా అపాంట్మెంట్స్..డిలే, రిస్క్ ను ఎలా తగ్గించాలంటే..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..!!
- ఆన్ లైన్ లో అటెస్టేషన్ సేవలు ప్రారంభం..ఇక 24గంటలు క్లియరెన్స్ సర్టిఫికేట్..!!
- 120 మిలియన్ల తీవ్రవాద కంటెంట్ తొలగింపు.. 14వేల ఛానెల్స్ మూసివేత..!!
- టీమిండియా ఆల్‌రౌండ్ షో….తొలి టీ20లో బంగ్లా చిత్తు
- TANA వైద్యశిబిరం విజయవంతం-550 మందికి చికిత్స
- Systematic Withdrawal Plan (SWP) ప్లాన్ లాభాల గురించి తెలుసా..?
- చెన్నై ఎయిర్ షో లో విషాదం