తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- April 18, 2024తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్‌కి వేళైంది. ఈ నెల 18.. అంటే రేపే.. ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 25 లోపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ వేసేందుకు అవకాశం ఉంటుంది. పబ్లిక్ హాలిడేలు, సెలవు దినాల్లోనూ నామినేషన్లు స్వీకరిస్తారు. దీంతో నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు అభ్యర్థులు.. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థుల వాహనాలను 200 మీటర్ల దూరంలోనే అధికారులు నిలిపివేస్తారు.
అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతిస్తారు. హైదరాబాద్, విజయవాడలోనూ రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నేపథ్యంలో నగరంలో ప్రత్యేక నిఘా పెట్టినట్టు అధికారులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వివరాలు..
ఏప్రిల్ 18 – నామినేషన్ల స్వీకరణ
ఏప్రిల్ 25 – నామినేషన్లకు చివరి తేదీ
ఏప్రిల్ 26 – నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 29 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
మే 13 – పోలింగ్
జూన్ 4 – ఎన్నికల ఫలితాలు.
నాలుగో దశలో.. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున.. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సైతం మే 13న జరగనున్నాయి. నాలుగో దశలో 96 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే 13న ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీన ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!