క్లౌడ్-సీడింగ్ పుకార్లను ఖండించిన యూఏఈ
- April 18, 2024
యూఏఈ: క్లౌడ్-సీడింగ్ పుకార్లను జాతీయ వాతావరణ కేంద్రం (NCM) ఖండించింది. భారీ వర్షాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనజీవనానికి అంతరాయం కలిగింది. దీంతో క్లౌడ్ సీడింగ్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో, క్లౌడ్ సీడింగ్ జరగదని ఎన్‌సిఎమ్‌కి చెందిన డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు. మరోవైపు యూఏఈలో మంగళవారం అసాధారణ వర్షపాతం నమోదైంది. 75 ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదైంది. దేశంలోని పలు ప్రాంతాలలో ఒక్కరోజులో 110మి.మీ వర్షం కురిసింది. దీంతో చాలా మంది నివాసితులు ఇబ్బందులు పడ్డారు. వరదలతో నిండిన రోడ్లు, ఇళ్లు మరియు విమానాశ్రయాలు మరియు మాల్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకు అల్ ఐన్‌లోని ఖత్మ్ అల్ షక్లా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైందని, 24 గంటల్లోపు 254 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని ఎన్‌సిఎం తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?