ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్..
- April 18, 2024
హైదరాబాద్: టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్.. సినిమాలు, వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నారు. విజయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న వస్తున్న ఈ హీరో గత ఏడాది.. ఏకంగా ఇది చిత్రాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఇటీవల ‘CSI సనాతన’ సినిమాతో మంచి రివ్యూలనే అందుకున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ఆది సాయి కుమార్.. తాజాగా మరో సినిమా స్టార్ట్ చేసారు.
అదికూడా సూపర్ హిట్ కాంబోని రిపీట్ చేస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. గతంలో తనకి ‘చుట్టలబ్బాయ్’ సినిమాతో మంచి విజయాన్ని అందించిన దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో కలిసి మరో సినిమాని తీసుకు రాబోతున్నారు. చుట్టలబ్బాయ్ మూవీ లాగానే ఈ చిత్రం కూడా విలేజ్ డ్రామాతో ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీతో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందట.
ఇక ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. నేడు ఈ మూవీని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసారు. దిల్ రాజు, అనిల్ రావిపూడి, సాయి కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ పై తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లాంచ్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?