రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- April 18, 2024
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల కేరళలో పర్యటన నేటితో పూర్తి కానుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం హైదరాబాద్ కి రానున్నారు.రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు పయనం కానున్నారు. ముఖ్యంగా రేపు ఉదయం మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభ లో పాల్గొననున్న సీఎం రేవంత్…..20 న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమం లో పాల్గొననున్నారు.
ఈ నెల 20 న సాయంత్రం కర్ణాటక లో ప్రచారం లో పాల్గొననున్న రేవంత్… 21న భువనగిరి లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమం లో పాల్గొననున్నారు. ఇక ఈ నెల 22 న ఉదయం ఆదిలాబాద్ లో నిర్వహించే సభ లో పాల్గొననున్న సీఎం రేవంత్… 23న నాగర్ కర్నూల్ జరిగే బహిరంగ సభ లో పాల్గొన్ననున్నారు. ఈ నెల 24న ఉదయం జహిరాబాద్, సాయంత్రం వరంగల్ లో నిర్వహించే సభ ల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?