వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!

- April 18, 2024 , by Maagulf
వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!

యూఏఈ: ఏప్రిల్ 16న కుండపోత వర్షం తో  రోడ్లన్ని చెరువులుగా మారాయి. అందుకు కార్లు చిక్కుకుపోయి పాడయ్యాయి.  వాహనాలను వరదలో వదిలివేయాలనే నిర్ణయం చాలా మందికి బాధాకరంగా అనిపించిందని, కానీ తప్పలేదని పలువురు నివాసితులు వాపోయారు.   "నీటి మట్టం పెరుగుతూ ఉండటం, నా కారు మునిగిపోవడం నేను నిస్సహాయంగా చూశాను." అని అల్ నహ్దా నివాసి హదీ అక్బరీ తెలిపారు. అక్బరీ కారు అతని అపార్ట్‌మెంట్ బ్లాక్ దగ్గర పార్కింగ్ చిక్కుకుపోయింది.  చాలామంది తమ కార్లను రోడ్డుపక్కన పార్క్ చేసి, భద్రత కోసం ఎత్తైన ప్రదేశాలకు తప్పించుకోవడానికి వాటిని విడిచిపెట్టినట్టు దుబాయ్‌లోని ఎమిరాటీ అయిన షేఖా వివరించారు.  అల్ ముతీనా నివాసి జస్టిన్ సిరిల్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనంలోకి నీరు ప్రవేశించడంతో అల్ ఇత్తిహాద్ రోడ్‌లో తన కారును వదిలివేశాడు. "ఇది నా జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయం" అని సిరిల్ చెప్పాడు. ఆఫీస్ నుంచి తిరిగొచ్చే సమయంలో తన కారు వరదలో చిక్కుకుందని దాందో దానిని రోడ్డుపైనే వదిలివేసినట్టు భారతీయ నివాసి థామస్ అలెగ్జాండర్ తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com