కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన

- April 19, 2024 , by Maagulf
కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన

యూఏఈ: దేశంలోని అరుదైన వర్షపు తుఫాను తర్వాత స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభం అయ్యాయి. షార్జాలోని నివాసితులు ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.  అల్ ఖాన్ ఇంటర్‌చేంజ్ సమీపంలోని అల్ వహ్దా రోడ్‌లో కార్ల నుంచి లీక్ అయిన ఆయిల్ తో పూర్తిగా రోడ్డు ఇబ్బంది క‌రంగా మారింది.  అల్ వహ్దా రోడ్‌లో దాదాపు కిలోమీటరు వరకు విస్తరించి ఉంద‌ని షార్జా నివాసి అహ్మద్ తెలిపారు.  వ‌రదల కారణంగా మేము ఇప్పటికే గణనీయమైన నష్టాలను చవిచూశామని, ఇప్పుడు మేము మా వాహనాలు మరియు ఆరోగ్యం రెండింటిపై ఆయిల్ లీకేజీ న‌ష్టాల‌ను చూస్తున్న‌ట్లు ఆటోమోటివ్ పరిశ్రమలో పనిచేస్తున్న ఫహద్ అన్నారు. స‌ద‌రు ఆయిల్ కాంటాక్ట్ వల్ల చర్మ రుగ్మతలు కూడా రావచ్చని అని ఫహద్ వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com