ఢిల్లీ క్యాపిటల్స్ పై ఎస్‌ఆర్‌హెచ్ ఘన విజయం
- April 20, 2024
న్యూ ఢిల్లీ: ఐపీఎల్ 17 సీజన్‌లో హైదరాబాద్ మరోసారి అదిరిపోయే ప్రదర్శన చేసింది. దిల్లీని వారి సొంత మైదానంలో 67 పరుగుల తేడాతో ఓడించి వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో దిల్లీ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది.పృథ్వీ షా (16), డేవిడ్ వార్నర్ (1) విఫలమైనా.. జేక్ ఫ్రేజర్ (65; 18 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు), అభిషేక్ పోరెల్ (42; 22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఫ్రేజర్, అభిషేక్ బౌండరీలతో విరుచుకుపడటంతో దిల్లీ స్కోరు 7 ఓవర్లకే 100 దాటింది. తర్వాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. రిషబ్ పంత్ (44; 34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) భారీ స్థాయిలో హిట్టింగ్ చేయలేకపోయాడు. మరో వైపు హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టడంతో దిల్లీ 200లోపే ఆలౌటైంది. నటరాజన్ (4/19) ఆకట్టుకున్నాడు. అతడు ఇన్నింగ్స్ 19 ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టడంతోపాటు ఒక్క పరుగూ ఇవ్వలేదు. మయాంక్ మర్కండే 2, నితీశ్ కుమార్ రెడ్డి 2, భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్‌లకు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ (10 పాయింట్లు) రెండో స్థానానికి దూసుకెళ్లింది.
ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (89; 32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (46; 12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించడంతో హైదరాబాద్ భారీ స్కోరుకు చేయడానికి బాటలు పడ్డాయి. చివర్లో షాబాజ్ అహ్మద్ (59*; 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. నితీశ్ రెడ్డి (37; 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. మార్‌క్రమ్ (1) విఫలం కాగా.. హెన్రిచ్ క్లాసెన్ (15; 8 బంతుల్లో 2 సిక్స్‌లు), అబ్దుల్ సమద్ (13; 8 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. దిల్లీ బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.
తాజా వార్తలు
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం







