తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- April 24, 2024
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 కోటా) టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. తిరుమల, తిరుపతిలో గదుల కోటా టికెట్ల(జులై నెల)ను నేడు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే శ్రీవారి సేవ కోటా టికెట్లను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ టికెట్లను మ.12 గంటలకు, పరకామణి సేవ కోటాను మ. ఒంటి గంటకు విడుదల చేయనుంది. ప్రతినెలా శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను మూడు నెలల ముందుగానే టీటీడీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జులై నెలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీటీడీ ఇటీవలే ప్రకటించింది. జులై నెలకు సంబంధించిన.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన లాంటి ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం.. ఏప్రిల్ 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. కాలినడకన వెళ్లలేని వారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నవారికి ఈ అవకాశం ఎంతో మేలు చేస్తుంది. మీరు టికెట్లు బుకు చేసుకోవాలని అనుకుంటే.. https://tirupatibalaji.ap.gov.inవెబ్‌సైట్‌కు వెళ్లండి. ఇందులో ప్రత్యేక దర్శన టికెట్లతో పాటు మరిన్ని సేవలూ బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







