ఆ హీరోయిన్‌కి అంత పెద్ద సక్సెస్ వచ్చినా స్టార్‌డమ్ రాలేదే.!
- April 24, 2024
ఒక్క సినిమా హీరోకైనా, హీరోయిన్‌కైనా దశ తిరగరాసేస్తుంది. కాజల్ అగర్వాల్‌కి ‘మగధీర’తో దశ తిరిగింది. అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతవరకూ చిన్న చిన్న సినిమాలతోనే సరిపెట్టుకున్న కాజల్, ఆ తర్వాత స్టార్ హీరోయిన్ ఛైర్ ఎక్కేసింది. ఆ స్టార్‌డమ్‌ని ఇంతవరకూ అలా నిలబెట్టుకుంటూ వస్తూనే వుంది.
తాజాగా ‘హనుమాన్’ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ అమృతా అయ్యర్ గురించి మనం మాట్లాడుకోవాలి. అమృతా అయ్యర్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో పరిచయమై ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.
అయితే, ‘హనుమాన్’ సినిమా అమృతా అయ్యర్‌కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు. ఏకంగా 300 కోట్లు వసూళ్లు సాధించడంతో పాటూ, వంద రోజుల ఫంక్షన్ కూడా సెలబ్రేట్ చేసుకున్న సినిమా ఇది. ఈ రోజుల్లో ఇది గ్రేట్ అచీవ్‌మెంట్‌గానే పరిగణించాలి.
అయితే, ఇంత జరిగినా అమృతా అయ్యర్‌కి ఈ సినిమాలో ఎంత మాత్రమూ క్రెడిట్ దక్కకపోవడమే దురదృష్టం. ‘పూలమ్మే పిల్లా..’ సాంగ్ అమృతపైనే చిత్రికరించినప్పటికీ హీరో సజ్జాకీ, పాటల రచయితకీ, గాయకుడికీ, మ్యూజిక్ డైరెక్టర్‌కీ వచ్చిన పేరులో కాస్తయినా అమృతా అయ్యర్‌కి రాకపోవడం ఆశ్చర్యకరం.
అంతే కాదు, ఇంత పెద్ద సక్సెస్ దక్కిన ఈ సినిమాతోనైనా తనను తాను ప్రమోట్ చేసుకోలేకపోయింది అమృతా అయ్యర్. ‘హనుమాన్’ సినిమాకి సంబంధించి ఎంత గొప్ప చెప్పుకుంటున్నా.. అదేంటో హీరోయిన్ అమృతా అయ్యర్‌కి గోరంతైనా ఆ గొప్ప దక్కలేదు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు