కొత్త జోనర్ ట్రై చేస్తున్న బెల్లంకొండ.!
- April 24, 2024
‘అల్లుడు శీను’ సినిమాతో తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలి సినిమాకే భారీ బడ్జెట్, స్టార్ హీరోయిన్ (సమంత).. కలయికలో నటించిన బెల్లంకొండ ఆ తర్వాత ఓ మోస్తరు హీరోగా బాగానే సెటిలయ్యాడు.
‘అల్లుడు అదుర్స్’ సినిమా తర్వాత బెల్లంకొండ కాస్త నెమ్మదించాడు. ‘జయ జానకీ నాయకా’ వంటి సూపర్ హిట్ సినిమా కూడా బెల్లంకొండ ఖాతాలో వున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో ఓ ప్రత్యేకమైన సినిమాతో రాబోతున్నాడు. హారర్ టచ్‌తో పాటూ, భారీ టెక్నికల్ వర్క్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకి ‘కిష్కిందపురి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాని వానరాల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు అందుకే ఆ టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో డిఫరెంట్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారట. తొలిసారి ఈ తరహా కాన్సెప్ట్‌లో బెల్లంకొండ నటిస్తున్నాడు. బెల్లంకొండ ఈ తాజా ప్రయోగం ఫలిస్తుందో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







