ఈ వారం చిన్న సినిమాల జాతర.! గెలుపెవరిదో.!
- May 01, 2024
ఈ వారం మూడు విభిన్న తరహా సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు పోటీ పడుతున్నాయ్. అందులో సీనియర్ హీరో అల్లరి నరేష్ కూడా వున్నాడు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే సినిమాతో లాంగ్ బ్యాక్ తర్వాత తనదైన వినోదంతో ఆకట్టుకోబోతున్నాడు అల్లరి నరేష్.
అలాగే ఈ మధ్య కంటెంట్ వున్న సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ తనదైన హీరోయిజంతో దూసుకెళ్లిపోతున్న యంగ్‌స్టర్ సుహాస్ ‘ప్రసన్నవదనం’ సినిమాతో వస్తున్నాడు. సుహాస్ ప్రధాన పాత్రలో సినిమా అంటే అది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ కంటెంటే.. అనే ముద్ర పడింది. సో, ఈ సినిమా పైనా అంచనాలు బాగానే వున్నాయ్.
ఇక ముచ్చటగా మూడో సినిమా ‘బాక్’. తమన్నా ప్రధాన పాత్రలో హారర్ బేస్ కంటెంట్‌తో ఈ సినిమా రూపొందింది. తమిళ ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా దెయ్యం పాత్రలో నటిస్తుండగా, రాశీఖన్నా మరో కీలకమైన పాత్ర పోషిస్తోంది.
మరి మూడు డిఫరెంట్ సబ్జెక్టుల్లో ఈ వారం బాక్సాఫీస్ వద్ద గెలుపు ఎవరిదో లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







