మే 13న నాలుగో విడత పోలింగ్..
- May 03, 2024
న్యూ ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల 4వ విడత పోలింగ్ 10 రాష్ట్రాల్లో జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ స్థానాలకు మే 13న పోలింగ్ జరుగుతుందని, 1717 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ప్రకటించింది. మొత్తం 4264 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన తర్వాత 1970 మిగిలాయని.. ఉపసంహరణ గడువు తర్వాత 1717 మంది పోటీలో నిలిచారని వివరించింది. రాష్ట్రాలవారీగా 96 పార్లమెంట్ స్థానాలకు ఎంత మంది పోటీ చేస్తున్నారనే వివరాలను శుక్రవారం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 454 మంది పోటీ
తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు 525 మంది పోటీ
బిహార్ లో 5 పార్లమెంట్ స్థానాలకు 55 మంది పోటీ
జమ్మూ కాశ్మీర్లో ఒక్క పార్లమెంట్ స్థానానికి బరిలో 24 మంది
జార్ఖండ్‌లో 4 పార్లమెంట్ స్థానాలకు 45 మంది పోటీ
మధ్యప్రదేశ్‌లో 8 పార్లమెంట్ స్థానాలకు 74 మంది పోటీ
మహారాష్ట్రలో 11 పార్లమెంట్ స్థానాలకు బరిలో 298 మంది
ఒడిశాలో 4 పార్లమెంట్ స్థానాలకు బరిలో 37 మంది
ఉత్తరప్రదేశ్‌లో 13 స్థానాలకు బరిలో 130 మంది
వెస్ట్ బెంగాల్లో 8 పార్లమెంట్ స్థానాలకు 75 మంది పోటీ
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..