తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- May 03, 2024
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు.
గాంధీ భవన్ లో జరిగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మేనిఫెస్టో కన్వీనర్ ప్రో. జానయ్య, సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్, రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
5 న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రత్యేక హామీలు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కాజీపేటలో రైల్వే కోచ్, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా, హైదరాబాద్ లో నీతి అయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు, 4 కొత్త సైనిక స్కూళ్లు, నేషనల్ ఏవియేషన్ యూనివర్శిటీ ఏర్పాటు, హైదరాబాద్ కు ఐటీఐఆర్ పాజెక్టు పునఃప్రారంభం, హైదరాబాద్ – విజయవాడ హైవే పక్కనుంచి ర్యాపిడ్ రైల్వే వ్యవస్థ, ప్రతి ఇంటికి సౌరశక్తి, రామగుండం – మణుగూరు ప్రత్యేక రైల్వే లైన్, హైదరాబాద్ లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







