ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- May 04, 2024
కువైట్ సిటీ: కువైట్ లో నివసిస్తూ వివిద కంపనీలలో మంచి మంచి ఉద్యోగాల్లో పనిచేస్తున్న చాలామంది తెలుగువారు అలాగే కువైటి ఇళ్ళల్లో పనిచేసే డ్రైవర్లు, డొమెస్టిక్ వర్కర్సుకు సెలవలు లేకపోవడం, లేదా చార్జీలు పెట్టుకొని అంత దూరం రాలేకపోవటం వలన ఎక్కువశాతం మే 13న జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేరు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న వారి కుటుంబ సభ్యులను, అక్కా చెల్లెళ్ళను, అన్నా తమ్ముళ్ళను, స్నేహితులను వీరు ప్రభావితం చేసే విధంగా వారందరికీ ఫోన్లు చేసి మాట్లాడటానికి చాలా అవకాశం ఉంటుంది.
ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యములో తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దత్తుగా కువైట్లో విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. తెలుగుదేశం పార్టీ గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు షేక్ బాషా, అద్దేపల్లి చిన్నా రాజు, కుటుంబ రావు, కోడూరు మహేష్ గౌడ్, గుణపాటి చిన్నబాబు, హరికృష్ణ మొదలగు వారు కువైట్ లో వివిధ రకాల పార్కుల్లో జమ అయ్యే తెలుగువారిని కలుసుకొని ఉమ్మడి మానిఫెస్టోలోని పధకాలను గురించి వివరిస్తూ ఇండియాలో ఉంటున్న వారి కుటుంబ సభ్యులను, స్నేహితులను ఉమ్మడి అభ్యర్ధులకు ఓటు వెసేలాగా వారికి ఫోన్లు చేసి తెలుపవలసిందిగా కోరుతున్నారు.
అలాగే కువైట్లోని ప్రముఖ ఆయిల్ కంపెనీలలో ఉద్యోగం చేస్తున్న ప్రముఖులను కుదరవల్లి సుధాకరరావు కలిసి వారికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పరిస్థిని వివరిస్తూ, చంద్రబాబు మరలా ముఖ్యమంత్రి అయితేగాని మన ఆస్తులకు రక్షణ ఉంటుందని, రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుందని, ఎన్నో కంపెనీలు వచ్చి రాష్ట్రం అభివృద్దిలోకి వెళ్ళుతుందని వివరిస్తూ కువైట్ లో వారు పని చేస్తున్న కంపెనీలో ఉన్నటువంటి తెలుగు వారికి మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలుగుదేశం కూటమి అభ్యర్ధులకు ఓటు వేసేలాగా తెలియచేయాలని విన్నవింస్తున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గంజాయి, మద్యం, ఇసుక మాఫియాలు రాజ్యం ఏలుతుందని వీటినుండి రాష్ట్రాన్ని కాపాడలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వీరందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా కుదరవల్లి సుధాకర్ రావు మాట్లాడుతూ ఎన్నికల రోజు వరకు కూడా కువైట్ లో తెలుగువారు అధికంగా నివసించే ఏరియాలు, వర్కర్ క్యాంపులు, కంపెనీలలో ఉన్న వారిని అందరిని సాధ్యమైనంత వరకు కలిసి ఇదే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ భారతదేశంలో ఉన్న వారి బంధుమిత్రులకు ఫోన్లో మాట్లాడి తెలుగుదేశంకు ఘనవిజయం చేకూర్చే విధంగా ప్రణాళికలు తయారు చేసుకున్నామని తెలియజేసారు.

తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







