భారత క్రికెట్‌ జట్టు ముంబయి నుంచి జింబాబ్వేకు ..

- June 08, 2016 , by Maagulf
భారత క్రికెట్‌ జట్టు ముంబయి నుంచి జింబాబ్వేకు ..

పరిమిత ఓవర్ల కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు ముంబయి నుంచి జింబాబ్వేకు బుధవారం బయల్దేరి వెళ్లింది. యువ క్రికెటర్లు, అనుభవంలేని ఆటగాళ్లతో కూడిన భారత జట్టు పర్యటనలో భాగంగా జింబాబ్వేతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఈ నెల 11న ప్రారంభంకానున్న సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లో జరుగుతాయి.టీ20 ప్రపంచకప్‌ వరకు బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న సంజయ్‌ భంగర్‌ను జింబాబ్వే సిరీస్‌కు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ధోని తన కెరీర్‌లో ఇప్పటి వరకు 275 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడగా ఈ సిరీస్‌లో ఉన్న మిగతా ఆటగాళ్లందరూ కలిసి ఇప్పటివరకు 83 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌ల్లో పాల్గొనడం విశేషం.'జింబాబ్వేతో సిరీస్‌లో ఆడబోయే ఆటగాళ్లలో చాలామంది కొత్త. కాబట్టి త్వరగా వారిపై నేనో అవగాహనకు రావాలి. జట్టు అవసరాల మేరకు ఎవరినెలా వినియోగించుకోవాలో ఇంకా నిర్ణయించుకోవాల్సి ఉంది' అని కెప్టెన్‌ ధోని వెల్లడించాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com