మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- May 05, 2024
బంగ్లాదేశ్: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది. బంగ్లాదేశ్ వేదికగా అక్టోబర్ 3 నుంచి ఈ మెగాటోర్నీ ఆరంభం కానుంది. అక్టోబర్ 20 వరకు జరగనున్న ఈ టోర్నీలో 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 10 జట్లు ఈ పొట్టి ప్రపంచకప్‌లో పోటీ పడనున్నాయి. ఇప్పటికే 8 అర్హత సాధించగా.. క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా మరో రెండు జట్లు పోటీలో పాల్గొంటాయి. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, క్వాలిఫయర్ 1 ఉండగా.. గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, క్వాలిఫయర్ 2 జట్లు ఉన్నాయి. ఇక భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న సిల్హెట్ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 6న జరగనుంది. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేలు ఉన్నాయి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







