అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- May 05, 2024
అబుదాబి: ఈరోజు అనగా ఆదివారం 5 మే 2024 నాడు మా గల్ఫ్ కార్మికులం అందరం కలిసి యూఏఈలో మన తెలంగాణలో మరియు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంటు ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థి గెలిచి నరేంద్ర మోడీ ని మూడవసారి ప్రధానమంత్రిగా చూడాలని అబుదాబిలో ఉన్నటువంటి BAPS హిందూ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇరుదేశాల దౌత్య పరమైన సంబంధాల సందర్భంగా ఈ దేశంలో ఒక మంచి ఆలయం నిర్మించి ఇచ్చినటువంటి మా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మరియు ఇక్కడ ఉన్నటువంటి రాజుకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయడం జరుగుతుంది.అదేవిధంగా రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ సంబంధాలు మెరుగుపరిచి ఇరుదేశాల అభివృద్ధికి దోహదపడాలని అదేవిధంగా మేము అందరం బాగుపడాలని ఆశిస్తున్నాం.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా ఇండ్ల కు ఫోన్ చేసి ప్రత్యేకంగా బంధువులకు,స్నేహితులకు ఫోన్ ద్వారా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని కోరడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో కుంభాల మహేందర్ రెడ్డి, ఆరే శరత్ గౌడ్,పెనుకుల అశోక్, పవన్ సాయి, శ్రీను, ప్రశాంత్,సాయి,దేవన్న, ఎండపెల్లి తిరుపతి పటేల్,రమేష్,నవీన్,తిరుపతి లతో పాటుగా సుమారు 100 మంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







