కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- May 05, 2024
మనామా: మెకానిక్ ను కత్తితో బెదిరిచిన కారు ఓనర్ కు హై క్రిమినల్ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడు మెకానిక్ గ్యారేజీలో తన కారును రిపేర్ చేయడానికి మెకానిక్‌తో అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేశాడని, మరమ్మతులు పూర్తయిన తర్వాత మెకానిక్ క్లయింట్‌కు తెలియజేశాడు. క్లయింట్ తన అపార్ట్‌మెంట్‌కు వాహనాన్ని డెలివరీ చేయమని కోరాడు. దానికి మెకానిక్ అంగీకరించి, అక్కడికి చేరుకోగానే పరిస్థితి తారుమారైంది. పోలీసులకు తెలిపిన మెకానిక్ కథనం ప్రకారం.. నిందితుడు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో కత్తిని చూపించాడని, దీంతో తాను బాల్కనీ నుంచి దూకి తప్పించుకున్నట్లు తెలిపాడు. "అదృష్టవశాత్తూ, సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న భార్యాభర్తలు నా ఏడుపు విని నా వద్దకు వచ్చారు. పోలీసులు వచ్చే వరకు వారి అపార్ట్మెంట్లో ఆశ్రయం పొందేందుకు నన్ను అనుమతించారు." అని పేర్కొన్నాడు. పోలీసులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించి విచారణ ప్రారంభించి, నిందితుడిని పట్టుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..