వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్‌ వచ్చేస్తోంది..

- May 05, 2024 , by Maagulf
వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్‌ వచ్చేస్తోంది..

ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ యూజర్ అకౌంట్లను మెసేజ్‌లు పంపకుండా నిరోధించేందుకు కొత్త ఫీచర్‌తో టెస్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం, అకౌంట్ లిమిట్ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో యాప్ ఫ్యూచర్ అప్‌డేట్ అందుబాటులో ఉండనుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ 2.24.10.5 అప్‌డేట్ కోసం లేటెస్ట్ వాట్సాప్ బీటాకు అప్‌డేట్ చేసుకోవాలి. వాట్సాప్ అకౌంట్ పరిమితి ఫీచర్‌పై పనిచేస్తోందని నివేదిక తెలిపింది.

వాట్సాప్ యూజర్ అకౌంట్లలో మెసేజ్‌లు పంపకుండా నియంత్రించే ఫీచర్‌పై పనిచేస్తోందని (WABetaInfo) స్క్రీన్‌షాట్ వెల్లడించింది. ఒకవేళ, మీ వాట్సాప్ అకౌంట్‌పై పరిమితం విధిస్తే.. ఉల్లంఘన కింద కొంత సమయం వరకు కొత్త చాట్‌ ఎవరితో చేయలేరు. అయినప్పటికీ, నియంత్రిత వినియోగదారులు ఇప్పటికీ చాట్‌లు, గ్రూపుల నుంచి మెసేజ్‌లను స్వీకరించగలరు. వాటికి రిప్లయ్ ఇవ్వగలరు.

నివేదిక ప్రకారం.. వాట్సాప్ స్పామ్ ఆటోమేటెడ్ లేదా బల్క్ మెసేజింగ్ లేదా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించే ఇతర కార్యకలాపాలను గుర్తించడానికి ఆటోమేటిక్ టూల్స్ ఉపయోగిస్తుంది. ఈ టూల్స్ మెసేజ్‌లు, కాల్స్ కంటెంట్‌ను యాక్సెస్ చేయలేవు. ఎందుకంటే.. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయి.

మెసేజ్ పంపే ఫ్రీక్వెన్సీ లేదా ఆటోమేటెడ్ స్క్రిప్ట్‌లు వాడుతున్నారా? లేదా వంటి అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడానికి నిర్దిష్ట ప్రవర్తనా విధానాలపై ఆధారపడతారు. ఈ ఆటోమాటిక్ డిటెక్షన్ ఫీచర్ హానికరమైన వాట్సాప్ అకౌంట్లను గుర్తించడంలో సాయపడుతుంది. అకౌంట్‌లను పూర్తిగా నిషేధించడం కన్నా పరిమితం చేయడమే సరైనదిగా భావిస్తోంది.

యూజర్లు తమ డేటాకు పూర్తిగా యాక్సెస్‌ను కోల్పోకుండా వారి సరిదిద్దుకునే అవకాశాన్ని వాట్సాప్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంద నివేదిక పేర్కొంది. ఈ ఫీచర్ ఔట్‌రైట్ అకౌంట్ బ్యాన్‌లకు బ్యాలెన్స్‌డ్ ప్రత్యామ్నాయంగా మారనుందని తెలిపింది. ముఖ్యమైన డేటా, కమ్యూనికేషన్‌లను కోల్పోయే అవకాశం ఉందని పేర్కొంది. తాత్కాలిక పరిమితి విధించడం ద్వారా వాట్సాప్‌ను ఉపయోగించకుండా నిరోధించడమే కాకుండా యూజర్లను శాశ్వతంగా నిషేధించకుండా సమస్యను పరిష్కరించాలని వాట్సాప్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com