ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్‌టీఏ కేంద్రాలు అప్‌గ్రేడ్
- May 06, 2024
దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ఉమ్మ్ రామూల్ మరియు అల్ బార్షా కేంద్రాలను స్మార్ట్, హైబ్రిడ్ హబ్‌లుగా మార్చే పని ప్రారంభించింది. ఈ రెండు కేంద్రాలు డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అంతటా సేవలను అందిస్తూనే ఉంటాయని, ఎటువంటి అంతరాయం ఉండదని అధికార RTA తెలిపింది. ఉమ్మ్ రామూల్ మరియు అల్ బార్షా కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్‌లు మానవ ప్రమేయం లేకుండా స్మార్ట్ పరికరాల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉండే సేవలను అందించగలవని, సేవా సలహాదారులు కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఈ సెప్టెంబర్‌లో పూర్తవుతుందని డైరెక్టర్ జనరల్ మరియు బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఛైర్మన్ మత్తర్ అల్ టేయర్ అన్నారు. గత రెండేళ్లలో మరో మూడు కేంద్రాలను స్మార్ట్ హబ్‌లుగా మార్చినట్లు తెలిపారు. నవంబర్ 2022లో అల్ కిఫాఫ్ సెంటర్, మార్చి 2023లో అల్ మనారా కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్ మరియు అదే సంవత్సరం మేలో అల్ తవార్ సెంటర్‌ను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం దీరా సెంటర్‌ను హైబ్రిడ్ సెంటర్‌గా మార్చడంతో ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుందని అల్ టేయర్ చెప్పారు. దీంతో ఆయా కేంద్రాల్లో లభించే సేవల పరిధి కూడా 78 నుంచి 213కి పెరగనుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







