ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- May 06, 2024
అమరావతి: నిన్నటివరకు డీజీపీగా వ్యవహరించిన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసిన నేపథ్యంలో, రాష్ట్ర నూతన పోలీస్ బాస్ గా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఎన్నికల సంఘం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది.
కాగా, కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన నేపథ్యంలో, ముగ్గురు సీనియర్ ఐజీల జాబితా పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో, ఏపీ ప్రభుత్వం సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు, హరీశ్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ ల పేర్లను సిఫారసు చేసింది. అయితే, ఎన్నికల సంఘం ఈ జాబితా నుంచి హరీశ్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా ఎంపిక చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..