ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- May 06, 2024
న్యూ ఢిల్లీ: టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తన బ్యాగేజీ పాలసీని మార్చింది. దేశీయ విమాన ప్రయాణాలు ఫ్రీ బ్యాగేజీపై ఉన్ గరిష్ట పరిమితిని తగ్గించింది. తక్కువ ధర టికెట్ ప్రయాణానికి గతంలో 20 కేజీలుగా ఉన్న బ్యాగేజీని 15 కేజీలకు తగ్గించింది.ఎకానమీలో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ ఫేర్ కేటగిరీ టికెట్లు తీసుకుంటారో వారు గరిష్టంగా ఇక నుంచి 15 కేజీలు మాత్రమే చెన్-ఇన్ బ్యాగేజీకి అనుమతి ఇస్తారు.
ఈ కొత్త రూల్స్ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా 25 కేజీల వరకు బ్యాగేజీకి అనుమతి ఇచ్చేది. టాటా గ్రూప్‌లోకి వచ్చిన తరువాత దీన్ని 20 కేజీలకు తగ్గించారు. తాజాగా ఫ్రీ బ్యాగేజీ పరిమితిని 15 కేజీలకు కుదించింది. కనీసం 15 కేజీల వరకు బ్యాగేజీని ఉచితంగా అనుమతించాలని డీజీసీఏ ఆదేశాలున్నాయి. దీంతో దాదాపు అన్ని ఎయిర్‌లైన్స్ ఇప్పటికే ఈ పరిమితని అనుసరిస్తున్నాయి.
ఇతర సంస్థలు ఒక లగేజీని మాత్రమే అనుమతిస్తున్నాయి. ఎయిర్ ఇండియా మాత్రం బరువు పరిమితికి లోబడి ఎన్ని బ్యాగులైనా తీసుకువెళ్లేందుకు అనుమతి ఇస్తోంది. ఎయిర్ ఇండియా వివిధ రకాల ఫేర్ తరగతులను గత ఏడాది ప్రవేశపెట్టింది. ఎకానమీ, ప్రీమియం ఎకానవీ, బిజినెస్, ఫస్ట్ క్లాస్‌లతో పాటు కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్, ఫ్లెక్స్ పేరిట మూడు ఉప తరగతులను తీసుకువచ్చింది. వీటిలో టికెట్ ధరతో పాటు ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి.
ఒక వేళ ఎకానమీ ఫ్లెక్స్ కేటగిరీలో టికెట్ తీసుకుంటే 25 కేజీల వరకు బ్యాగేజీని అనుమతి ఇస్తారు. సాధారణంగా బరువు అనేది విమానం ఇంధనాన్ని ఆదా చేయడానికి ఉపయోగపడుతుంది. ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ పాలసీ కంపెనీ తన బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







