సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం

- May 06, 2024 , by Maagulf
సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం

రియాద్: సౌదీ అరేబియా సాధారణ బడ్జెట్ SR12.39 బిలియన్ల లోటును నమోదు చేసింది. మొత్తం పబ్లిక్ వ్యయం సుమారు SR305.82 బిలియన్లు కాగా, 2023 అదే త్రైమాసికంతో పోలిస్తే 2024 మొదటి త్రైమాసికంలో రాబడి SR293.43 బిలియన్లను నమోదు చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రచురించిన మొదటి త్రైమాసిక బడ్జెట్ పనితీరు నివేదిక ప్రకారం.. నాన్-ఆయిల్ ఆదాయాలు మొత్తం రాబడిలో 38 శాతంగా ఉన్నాయి. అవి దాదాపు SR111.51 బిలియన్లు. చమురు ఆదాయాలు 62 శాతం (SR181.92 బిలియన్లు)గా ఉంది. 2023 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే మొత్తం రాబడులు 18 శాతం పడిపోవడం గమనార్హం. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే మొదటి త్రైమాసికంలో నాన్-ఆయిల్ రాబడులు 9 శాతం పెరిగాయని, SR9.17 బిలియన్ల ఆర్థిక పెరుగుదలతో, చమురు ఆదాయం 1.9 శాతం(SR3.32 బిలియన్) పెరిగిందని మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది.  2024 రాష్ట్ర బడ్జెట్ SR1.17 ట్రిలియన్ల విలువైన ఆదాయాలను అంచనా వేయగా, ఖర్చుల విలువ 2024 సంవత్సరంలో SR79 బిలియన్ల లోటుతో సుమారు SR1.25 ట్రిలియన్లకు చేరుతుందని అంచనా వేశారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com