హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్

- May 07, 2024 , by Maagulf
హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్

యూఏఈ: హట్టా పర్వతాలపై హైకింగ్ చేస్తున్నప్పుడు తీవ్రమైన అలసట మరియు అధిక రక్తపోటు కారణంగా కదలలేకపోయిన బ్రిటీష్ టూరిస్ట్‌ను దుబాయ్ పోలీస్ ఎయిర్ వింగ్ మరియు బ్రేవ్ స్క్వాడ్ రక్షించాయి. పోలీసులకు అందిన ఎమర్జెన్సీ అలర్ట్‌తో ఈ ఆపరేషన్‌ నిర్వహించారు.  పర్యాటకుడికి అత్యవసరంగా తరలించాల్సిన అవసరం ఉందని, కాలినడకన దిగడానికి అతనికి నాలుగు గంటల సమయం పట్టేదని దుబాయ్ పోలీస్ ఎయిర్ వింగ్ సెంటర్ డైరెక్టర్ పైలట్ కల్నల్ అలీ అల్ ముహైరి తెలిపారు. హట్టాలోని దుబాయ్ పోలీసుల బ్రేవ్ స్క్వాడ్ నుండి అలెర్ట్ ను స్వీకరించిన తర్వాత వారు వైద్య బృందంతో కూడిన హెలికాప్టర్‌ను పంపించారు.  పర్యాటకులను చేరుకోవడానికి స్క్వాడ్ థర్మల్ ఇమేజింగ్‌తో కూడిన డ్రోన్‌లను ఉపయోగించినట్టు బ్రేవ్ స్క్వాడ్ హెడ్ లెఫ్టినెంట్ ముహమ్మద్ ఒబైద్ అల్ కాబీ తెలిపారు. తీవ్రమైన అలసట మరియు అధిక రక్తపోటు కారణంగా పర్యాటకుడు నడవలేకపోయాడని వివరించారు. అతనికి ప్రథమ చికిత్స అందించిన తర్వాత, బ్రేవ్ స్క్వాడ్ పర్యాటకులను హట్టా హాస్పిటల్‌కు ఎయిర్‌లిఫ్ట్ చేసింది. పర్వతాలు లేదా లోయ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో దుబాయ్ పోలీస్ యాప్‌లోని ఎమర్జెన్సీ నంబర్ 999 లేదా SOS సేవను సంప్రదించాలని ప్రజలకు లెఫ్టినెంట్ ముహమ్మద్ ఒబైద్ అల్ కాబీ గుర్తు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com