కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..
- May 07, 2024
న్యూ ఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, గోవా, దాద్రానగర్ హవేలీ – దమణ్ దీవ్ రాష్ట్రాల్లో మొత్తం 92 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 17.24కోట్ల మంది ఓటర్లు ఉన్నాయి. ఇందుకోసం 1.85లక్షల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది.
మూడో విడత పోలింగ్ లో భాగంగా గుజరాత్ రాష్ట్రం గాంధీ నగర్ లోని నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎండల్లోనూ ప్రజలు తరలివచ్చి ఓటు వేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉంది. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంది. ప్రజాస్వామ్య యజ్ఞంలో ఓటర్లంతా భాగస్వామ్యం కావాలి. దేశ ప్రజలు ఎన్నికల ప్రక్రియను ఒక పండుగలా జరుపుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. మోదీతోపాటు కేంద్ర మంత్రి అమిత్ షా అదే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా గుజరాత్ అహ్మదాబాద్ లోని షిలాజ్ ప్రాథమిక పాఠశాలలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చేందుకు తమ వంతు సహకారం అందించాలని ఆనందీబెన్ పటేల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. వీరితో పాటు ఆయా రాష్ట్రాల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అహ్మదాబాద్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేసిన తరువాత ప్రజలకు మోదీ అభివాదం చేశారు. మోదీతో కరచాలనం చేసేందుకు స్థానికులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఓ వృద్ధ మహిళ మోదీకి రాఖీ కట్టారు. అనంతరం ఓ మహిళ వద్ద చిన్నారిని మోదీ ఎత్తుకొని కొద్దిసేపు ముద్దుచేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!