నారా రోహిత్ ‘ప్రతినిధి 2’.! పొలిటికల్ హీట్‌లో కొట్టుకెళ్లిపోతుందా.? బూస్ట్ ఇస్తుందా.?
- May 09, 2024
ప్రస్తుతం ఎలక్షన్ హీట్.. ఎండల వేడిని సైతం డామినేట్ చేస్తోంది. ముట్టుకుంటే కందిపోతారనుకునే సెలబ్రిటీలు సైతం మండుతున్న ఎండల్ని లెక్క చేయకుండా.. తమదైన స్టైల్‌లో ఎలక్షన్ ప్రచారంలో జోరుగా తిరుగుతున్నారు.
తమ అభిమాన హీరోని జనం కోసం పాటు పడే జనసేనానిని గెలిపించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్‌కి మద్దతు పలుకుతూ ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు.
జబర్దస్త్ బ్యాచ్ వంటి టీవీ ఆర్టిస్టులు, మెగా హీరోల వంటి స్టార్ మూవీ ఆర్టిస్టులూ, సితార ఎంటర్టైన్‌మెంట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ అధినేత వంశీ వంటి వారు సైతం పవన్‌కి మద్దతు తెలుపుతూ ఫీల్డ్‌లో తిరుగుతూ ఇంటింటికీ జనసేనానిని గెలిపించాలని కోరుకుంటున్నారు.
ఈ టైమ్‌లోనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ‘ప్రతినిధి 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు నారా రోహిత్.
లాంగ్ గ్యాప్ తర్వాత నారా రోహిత్ నుంచి వస్తున్న చిత్రమిది. ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజెంట్ సిట్యువేషన్ కూడా కలిసొచ్చేలా వుంది. ఒకవేళ సినిమా అటూ ఇటూగా వున్నప్పటికీ సినిమాలోని కొన్ని పవర్ ఫుల్ డైలాగులూ సోషల్ మీడియాలో సిట్యువేషన్‌కి తగ్గట్లుగా వినిపించడం మాత్రం పక్కా.
టైమ్ కలిసొచ్చి.. సినిమాకి మంచి టాక్ వస్తే.. నారా రోహిత్ సైతం తనవంతుగా రియల్ పాలిటిక్స్‌లో పార్టిసిపేట్ చేసినట్లే అవుతుంది తన రీల్ పర్‌ఫామెన్స్ ద్వారా. చూడాలి మరి ఏం జరుగుతుందో.! అన్నట్లు సీనియర్ న్యూస్ రీడర్ మూర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!